ఎన్టీఆర్ విలన్ అతనే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి డైరక్షన్ లో చేస్తున్న సినిమా జై లవకుశ. రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలను పెంచేసిన ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ ఫిక్స్ చేశారు నిర్మాత నందమూరి కళ్యాణ్ రాం. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ నటిస్తున్నాడని తెలుస్తుంది.  

కాబిల్ సినిమాలో రోనిత్ నటన చూసి మెచ్చిన బాబి తారక్ విలన్ గా అతన్ని సెలెక్ట్ చేశాడట. బాలీవుడ్ లో టాలెంటెడ్ విలన్ అయిన రోనిత్ రాయ్ సౌత్ ఇండస్ట్రీకి ఎన్.టి.ఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఎన్టీఆర్ చాలా మంచి నటుడు.. ఎంతో గొప్ప వ్యక్తని అంటున్నాడు రోనిత్ రాయ్. ఆయన సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అవడం తన అదృష్టమని అన్నారు రోనిత్ రాయ్. సో మరో కొత్త విలన్ బాలీవుడ్ నుండి దిగాడన్నమాట. మరి ఈ విలన్ విన్యాసాలు మన తెలుగు ప్రేక్షకులకు ఏమేరకు నచ్చుతాయో చూడాలి.