సుచి లీక్స్ మళ్లీ మొదలయ్యాయి..!

కోలీవుడ్ లో సుచి లీక్స్ పేరుతో జరుగుతున్న రచ్చ అందరికి తెలిసిందే. సింగర్ సుచిత్రకు సంబంధించిన ట్విట్టర్ హ్యాక్ అవడమే కాకుండా ఆమె దగ్గరున్న సిని తార గుట్టంతా రట్టు చేస్తున్నారు. కోలీవుడ్ టాప్ స్టార్స్ హీరో హీరోయిన్స్ అంతా ఈ లీక్స్ బారిన పడిన వారే. కొద్ది పాటి గ్యాప్ తర్వాత సుచి లీక్స్ మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. ఆ లీకులకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ సింగర్ సుచిత్ర చెప్పేసి అమెరికా చెక్కేసింది.


అయితే ఇప్పుడు సుచి లీక్స్ పార్ట్ 2 అంటూ హీరోయిన్ నివేదా పెతురాజ్ హాట్ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సుచి లీక్స్ ఎకౌంట్ నుండి ఈ భామ హాట్ వీడియో రాబోతుందని వార్తలు వస్తున్నాయి. మలయాళ భామ అయిన నివేదా కోలీవుడ్ లో కాస్త ఫాంలోకి వచ్చింది. తెలుగులో మెంటల్ మదిలో అంటూ శ్రీవిష్ణు హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తుంది. మరి సుచి లీక్స్ బయట పడకుండా స్టార్స్ అతా మ్యాటర్ సెటిల్ చేశారని వార్తలొచ్చాయి. ఈ పార్ట్-2 ఎవరిని బెదిరిద్దామనో ఏంటో తెలియాల్సి ఉంది.