అభిమానులకు ఆనందాన్ని ఇవ్వడంలో స్టార్స్ ఎప్పుడు ముందుంటారు.. ఈ విషయంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇంకాస్త ఎక్కువ ముందుచూపుతో ఉంటాడు. అందుకే పండుగ ఏది వచ్చినా తన తరపున ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇస్తుంటాడు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా తారక్ తను ప్రస్తుతం నటిస్తున్న జై లవకుశ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. బాబి డైరక్షన్ లో తారక్ నటిస్తున్న ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే.
రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాతో మళ్లీ తారక్ రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని అంటున్నారు. దసరా బరిలో దిగేందుకు సిద్ధమైన తారక్ మిగతా హీరోలతో ఫోటీకి సిద్ధమయ్యాడు.