
టైగర్ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన విఐ ఆనంద్ ఆ తర్వాత వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నావాడా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నిఖిల్ హీరోగా వచ్చిన ఆ సినిమా నోట్ల రద్దు ఎఫెక్ట్ ఉన్నా సినిమా హిట్ చేసేశారు ఆడియెన్స్. ఇక ప్రస్తుతం ఆనంద్ అల్లు శిరీష్ హీరోగా ఏ నిమిషానికి ఏమి జరుగునో టైటిల్ కన్ఫాం చేశారు. ఈ సినిమా కూడా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.
ఇక అల్లు శిరీష్ సినిమాకు పనిచేస్తున్న డైరక్టర్ విఐ ఆనంద్ టాలెంట్ చూసి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మంచి కథ ఉంటే సిద్ధం చేసుకో అల్లు అర్జున్ తో సినిమా తీసేద్దాం అన్నాడట. చిన్న దర్శకులకు మంచి అవకాశాలు ఇస్తూ సూపర్ హిట్ అందుకుంటున్న గీతా ఆర్ట్స్ దర్శకుడిలోని టాలెంట్ ను బట్టి స్టార్స్ ను సైతం సెట్ చేసేస్తుందన్నమాట. డిజె తర్వాత వక్కంతం వంశీ సినిమా స్టార్ట్ చేసిన బన్ని ఆ తర్వాత విఐ ఆనంద్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. సో ఈ దర్శకుడికి ఇది కచ్చితంగా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.