
హ్యాపీస్ డేస్ సినిమాతో యూత్ ఆడియెన్స్ కు క్రేజీ డైరక్టర్ గా మారిన శేఖర్ కమ్ముల ఆ తర్వాత తీసిన సినిమాలేవి ఆ స్థాయిని చేరుకోలేకపోయాయి. అనామిక సినిమా తీసినా అది అంతగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే కొద్దిపాటి గ్యాప్ తో వరుణ్ తేజ్ తో ఫిదా మూవీ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. మలయాళ భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ రిలీజ్ డేట్ ను ఎనౌస్ చేసింది. జూలై 21న ఫిదా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. ఎన్నారై అబ్బాయిగా వరుణ్.. తెలంగాణా అమ్మాయిగా సాయి పల్లవి ఇద్దరు ఎలా ప్రేమలో పడ్డారు అన్నది కథ. మరి ట్రైలర్ తో ఫిదా చేసిన శేఖర్ కమ్ముల సినిమాను కూడా అదే రేంజ్లో ఫిదా అయ్యేలా చేస్తాడో లేదో చూడాలి.