
డైరెక్టర్, హీరో, కథ. ఒక సినిమా బాగా ఆడాలంటే, ఈ మూడింటిలో ఏదో ఒక కారణం బలంగా ఉండాలి. అయితే అఆ చిత్రం విషయంలో మాత్రం ఈ లెక్కలు తారు మారు అవుతున్నాయి. అసలు సినిమాకి సంబంధమే లేని ఒక వ్యక్తి కోసం, అందరూ సినిమా చూడబోతున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
నితిన్ ఇష్క్ సినిమా ఆడియో వేడుకకు పవన్ ముఖ్య అతిధిగా హాజరైన దగ్గరి నుండి తన ప్రతి సినిమాని పవన్ అభిమానులు నెత్తిన ఎక్కించుకున్నారు. ముఖ్యంగా 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలో, టైటిల్ దగ్గరి నుండి పవన్ నామ స్మరణ ఎన్నో సార్లు చేయడంతో ఆ సినిమా బంపర్ హిట్ అయింది. అయితే మొన్నటి 'చిన్నదాన నీకోసం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' ఫ్లాపుల సమయంలో మళ్ళీ పవన్ చేయి అవసరం పడింది.
అదే సమయంలో పెద్ద హీరోలతో సినిమాలు చేసే త్రివిక్రమ్, నితిన్ తో సినిమా చేయాలనుకోవడం, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ప్రాణ స్నేహితులు అవడంతో, అఆ ఆడియో ఫంక్షన్ తో పాటు, సినిమా షూటింగ్ సెట్స్ కి కూడా పవన్ రావడం జరిగింది. దానితో పాటు అఆ సినిమాలో కూడా, గుండె జారి గల్లతయ్యిందే లో లాగా పవన్ నామ స్మరణ ఉంటుంది అని సమాచారం. అదే నిజమైతే ఫ్లాపులలో ఉన్న నితిన్ ఫాంలోకి వచ్చినట్టే. జూన్ 2న ప్రపంచ వ్యాప్తంగా అఆ విడుదలవుతుంది.