
మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 తర్వాత చేస్తున్న సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అందచేస్తున్నారు. 150 ఏళ్ల క్రితం జరిగిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర కొద్దిగానే తెలిసినా దానికి సినిమాటిక్ ఫ్లేవర్ జోడించి కథ సిద్ధం చేశారట.
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఐశ్వర్యరాయ్ తో సంప్రదింపులు జరుపుతుండగా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో ఉంటారని తెలుస్తుంది. స్వీటీ అనుష్కతో పాటుగా నయనతార కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో భాగమవుతారని ఫిల్మ్ నగర్ టాక్. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 22 మెగాస్టార్ పుట్టినరోజున ముహుర్తంతో పాటూ ఫస్ట్ లుక్ కూడా ఆరోజే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.