
స్పైడర్ పూర్తి కాకుండానే మహేష్ శ్రీమంతుడు కాంబోలో కొరటాల శివ డైరక్షన్ లో మూవీ స్టార్ట్ చేశాడు. మహేష్ లేకుండానే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం మహేష్ తో షూటింగ్ జరుపుకుంటుంది. భరత్ అను నేను టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తాడని తెలుస్తుంది. సినిమాలో సిఎంగా మహేష్ సర్ ప్రైజ్ ఇవ్వడం ఖామనట.
హైదరాబాద్ అవుట్ స్కట్స్ లో వేసిన అసెంబ్లీ సెట్ లో మహేష్ సిఎంకు సంబంధించిన షూటింగ్ జరుపుకుంటుందట. సినిమాలో మహేష్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సిఎం గా మహేష్ కొత్తగా చేస్తున్న ఈ సినిమా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి.