మెగా మేనళ్లుడితో అందాల రాక్షసి..!

మెగా మేనళ్లుడు సుప్రీం హీరో సాయి ధరం తేజ్ మెగా హీరోల్లో ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. సుప్రీం హిట్ తో స్టార్ గా అవతరించిన తేజ్ తిక్క, విన్నర్ సినిమాల ఫలితాలతో కాస్త అసంతృప్తితో ఉన్నాడు. ప్రస్తుతం జవాన్ సినిమాతో రాబోతున్న ఈ సినిమా తర్వాత వినాయక్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేశాడు సాయి ధరం తేజ్.

సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటిస్తుందని టాక్. మెగా హీరోల్లో ఇప్పటికే శ్రీరస్తు శుభమస్తులో అల్లు శిరీష్ తో, మిస్టర్ లో వరుణ్ తేజ్ తో జోడి కట్టిన లావణ్య ఈసారి మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఇన్నాళ్లు యువ దర్శకులతో సత్తా చాటిన తేజ్ కెరియర్ లో మొదటిసారి స్టార్ డైరక్టర్ తో సినిమా చేస్తున్నాడు. ఆకుల శివ కథ అందిస్తున్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ చేస్తారట.