జైలవకుశ టీజర్ రిలీజ్ డేట్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసిన తారక్ ఆ పోస్టర్స్ లోని తన ఇంటెన్స్ తో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. ఇక టీజర్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్ కు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి ఉత్సాహం నింపారు చిత్రయూనిట్. జై లవకుశ ఫస్ట్ లుక్ టీజర్ జూలై మొదటి వారంలో రిలీజ్ అవనుందని ట్విట్టర్ లో ఎనౌన్స్ చేశారు.

మొదటి వారం అని చెప్పినా జూలై 5న కళ్యాణ్ రాం బర్త్ డే కానుకగా జై లవకుశ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. జై లవకుశ నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్పెషల్ రోల్ లో నందిత కూడా నటిస్తుందని తెలుస్తుంది. సెప్టెంబర్ 1న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న చిత్రయూనిట్ ఆ రోజున సినిమా వచ్చేందుకు నిర్విరామంగా షూటింగ్ చేస్తుంది.