పవర్ స్టార్ స్లిమ్ లుక్.. పికె 25లో సర్ ప్రైజ్ అదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ చూసి అందరు షాక్ అవుతున్నారు. కాటమరాయుడు సినిమాలో కాస్త బొద్దుగా కానొచ్చిన పవన్ కళ్యాణ్ త్రివిక్రం సినిమా కోసం తగ్గాల్సి వచ్చిందట. కొద్ది రోజుల పాటు కేవలం లిక్విడ్ ఫుడ్ నే తీసుకున్నారని టాక్. ఇక ఇన్నాళ్లు కెమెరా కంట పడని పవన్ రీసెంట్ గా పబ్లిక్ లోకి వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు.

స్లిం లుక్ లో పవన్ అదరగొట్టేశాడు.. త్రివిక్రం మూవీలో పవన్ ఇదే ప్రత్యేకమైన సర్ ప్రైజ్ లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం హ్యాట్రిక్ కాంబినేషన్ తో ఈ సినిమా రాబోతుంది. ఓ పక్క పొలిటికల్ మరో పక్క సినిమా షెడ్యూళ్లతో పవన్ బక్కచిక్కిపోయాడని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.