అఖిల్ మూవీ ఆ టైటిల్ కన్ఫాం చేస్తారా..?

అక్కినేని అఖిల్ రెండో సినిమాగా విక్రం కుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతుంది. కింగ్ నాగార్జున నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉంటుందట. సినిమా టైటిల్ గా హలో గురు ప్రేమకోసమే అని పెట్టబోతున్నారట. నాగార్జున, అమల నటించిన నిర్ణయం సినిమాలో సూపర్ హిట్ పాటనే టైటిల్ గా అఖిల్ మూవీకి పెట్టనున్నారట.

మనంతో అన్నపూర్ణ ఫ్యామిలీకి చరిత్రలో నిలిచపోయే సినిమా ఇచ్చిన విక్రం కుమార్ లాస్ట్ ఇయర్ 24 సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇక మళ్లీ అలాంటి క్రేజీ డైరక్టర్ చేతిలోనే అఖిల్ కెరియర్ పెట్టేశాడు నాగార్జున. విక్రం టేకింగ్ మీద నమ్మకం ఉంచిన నాగ్ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడట. మరి అఖిల్ విక్రం కుమార్ ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి. టైటిల్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. చూస్తుంటే హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం సాంగ్ ను కూడా ఈ సినిమాలో రీమిక్స్ చేస్తారనిపిస్తుంది.