ఫస్ట్ లుక్ జవాన్ అదరగొట్టాడు..!

మెగా హీరోల్లో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న సుప్రీం హీరో సాయి ధరం తేజ్ తిక్క, విన్నర్ లు ఫలితాలు తేడా కొట్టేయడంతో జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం బివిఎస్ రవి డైరక్షన్ లో జవాన్ సినిమా చేస్తున్న తేజ్ ఆ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు. జవాన్ ఇంటికొక్కడు క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ జవాన్ గా కనిపించనున్నాడు.

రైటర్ గా సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన బివిఎస్ రవి దర్శకుడిగా మొదటి సినిమా వాంటెడ్ డిజాస్టర్ అయ్యింది. ఇక కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని మళ్లీ జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు బివిఎస్ రవి. ఈ సినిమా అటు తేజ్ తో పాటుగా రవికి కూడా హిట్ అవ్వాల్సిందే. లేదంటే కెరియర్ సంక్షోభంలో పడిపోతాడు తేజ్. మెహెరిన్ కౌర్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.