
త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీద ఉంది. సినిమాలో ఇప్పటికే విలన్ గా ఆది పినిశెట్టి, హీరో అత్తగా ఖుష్బు నటిస్తుండగా ఇప్పుడు అదే సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హింది భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
పవన్ త్రివిక్రం జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత వస్తున్న ఈ సినిమా టైటిల్ గురించి రకరకాల పేర్లు వినపడ్డాయి. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. గోపాల గోపాల సినిమాలో కలిసి నటించిన వెంకటేష్, పవన్ మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. మరి వెంకటేష్ పవన్ త్రివిక్రం ఈ ముగ్గురు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.