
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ హాట్ పెయిర్ లో ఈ ఇద్దరి జంట ఒకటి. బృందావనం, టెంపర్ సినిమాల్లో నటించిన ఈ జంట ప్రేక్షకులను అలరించింది. ఇక తనతో ఉన్న సాన్నిహిత్యంతోనే జనతా గ్యారేజ్ లో ఐటం సాంగ్ చేశానని అంటుంది కాజల్. కెరియర్ లో తొలిసారిగా పక్కా లోకల్ అంటూ ఐటం సాంగ్ లో నర్తించిన కాజల్ ఐటం గాళ్ గా కొనసాగుతారా అంటే సారీ.. ఆ సాంగ్ కూడా ఏదో ఎన్.టి.ఆర్ అడిగాడు కాబట్టి చేశానని అంటుంది.
కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. సాంగ్ ఉండటమే ఊర మాస్ అలాంటి సాంగ్ కు కాజల్ కూడా అంతే అందాలతో కేక పెట్టించేసింది. పక్కా లోకల్ తర్వాత కాజల్ కు ఐటం ఆఫర్లు చాలానే వచ్చాయి. కాని అమ్మడు మాత్రం వాటిని కాదనేసింది. తారక్ అడిగాడని ఐటంగా చేసిన కాజల్ ఇప్పుడు ఆ తప్పు చేసినందుకు తెగ బాధపడుతుంది. ప్రస్తుతం రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్న కాజల్ తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలను చేస్తుంది.