చరణ్ తో సోనాక్షి.. అదిరిపోయే ఐటం సాంగ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రాం చరణ్ లుక్ చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఓ హాట్ ఐటం సాంగ్ ప్లాన్ చేశాడట సుకుమార్.

ఈ సాంగ్ కోసం బాలీవుడ్ భామలను దించేస్తున్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం చరణ్ తో సోనాక్షి సిన్హా ఐటం సాంగ్ చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా లేని సోనాక్షి సౌత్ సినిమాలపై కన్నేసింది. ఇప్పటికే సూపర్ స్టార్ రజిని లింగా సినిమాల్లో నటించిన సోనాక్షి చరణ్ తో ఐటం సాంగ్ చేస్తే తొలిసారి తెలుగు సినిమాలో నటించినట్టు అవుతుంది. ఇక మరో పక్క చిరు 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో కూడా సోనాక్షి అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట చిత్రయూనిట్. ప్రస్తుతం ఆమెతో చర్చలు నడిపిస్తున్న యూనిట్ ఆమె ఓకే అంటే ఫైనల్ గా ఎనౌన్స్ మెంట్ చేస్తారట.