
మెగా హీరోల్లో అల్లు శిరీష్ ది డిఫరెంట్ స్టైల్ గౌరవంతో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్నా కమర్షియల్ బాట పట్టేదాకా హిట్ మాత్రం తలుపు తట్టలేదు. లాస్ట్ ఇయర్ శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్ అందుకున్న శిరీష్ ప్రస్తుతం ఎక్కడికి పోత్తావు చిన్నవాడా సినిమా డైరక్టర్ వి.ఐ.ఆనంద్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఎప్పుడు మెగా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే శిరీష్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటాడు.
ఇక ఈరోజు స్పెషల్ గా వర్షం అంటే తనకు పడదని చెప్పుకొచ్చిన శిరీష్ రొమాన్స్ కు పెళ్లి అవసరం లేదు రిలేషన్ షిప్ ఉంటే చాలు అని షాక్ ఇచ్చాడు. అభిమానులతో ఓపెన్ గా ఉండే స్టార్స్ తక్కువమంది బ్యాచిలర్ కాబట్టి అల్లు హీరో మొహమాటం లేకుండా ఎలాంటి విషయాన్నైనా చెప్పేస్తాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.