పసి ప్రాణం నిలబెట్టిన చరణ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఓ పసివాడి ప్రాణం నిలబెట్టాడు.. ఇదేదో రీల్ లైఫ్ స్టోరీ కాదండి బాబు నిజంగానే రియల్ హీరో అనిపించేసుకున్నాడు రాం చరణ్. సుకుమార్ డైరక్షన్ లో రాం చరణ్ నటిస్తున్న సినిమా రంగస్థలం. రాజమండ్రిలో పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ టైంలో ధనుష్ అనే కుర్రాడికి మూత్రపిండాలకు సంబందించిన వ్యాధి వచ్చిందట.    


లోకల్ డాక్టర్స్ ఆపరేషన్ అవసరమనగా దానికి కావాల్సిన మొత్తాన్ని చరణ్ సహాయం కోరారు. ధనుష్ వారి తల్లితండ్రుల బాధను అర్ధం చేసుకున్న చరణ్ ఆ పిల్లవాడికి కావాల్సిన ఆపరేషన్ ఖర్చు అంతా తానే చూసుకుంటానని హామి ఇచ్చారట. ఫైనల్ గా ధనుష్ ఆపరేషన్ చేయించడం అతనికి నయం అవడం అంతా జరిగిందట. ప్రస్తుతం మళ్లీ షెడ్యూల్ చేసేందుకు రాజమహేంద్రవరం చేరుకున్న చరణ్ కు ధన్యవాదాలు తెలిపేందుకు ధనుష్ తన పేరెంట్స్ చరణ్ కు కలిశారు. ధనుష్ రికవరీ అయినందుకు చరణ్ చాలా సంతోషపడ్డాడట. ధనుష్ ను దగ్గరకు తీసుకుని మరి ఆడించాడట చరణ్. అంతేకాదు మగధీరలోని డైలాగ్ చెప్పి చరణ్ ను అబ్బురపరచాడట ధనుష్.