బాలీవుడ్ లో పవన్ రేంజ్ అది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న మూవీ సెట్స్ మీద ఉంది. సినిమా సగానికి పైగా పూర్తవ్వగానే ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో పవన్ క్రేజ్ గురించి తెలిసిందే ఈ క్రమంలో ఇక్కడ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతుంది. ఇక మరో పక్క హిందిలో కూడా పవన్ త్రివిక్రం సినిమా బాగానే అమ్ముడయ్యాయట.

బాహుబలి తర్వాత తెలుగు సినిమా మీద బాలీవుడ్ నిర్మాతల కన్ను పడింది. మంచి కథ అయితే రీమేక్ లేదంటే డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆ క్రమంలో పవన్ సినిమాను 11 కోట్లతో హిందిలో శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను తీసుకున్నారట. బాలీవుడ్ లో పవన్ రేంజ్ తెలిసేలా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కూడా హిందిలో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఈ సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు.