
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. స్టార్ సినిమా అంటే పోటీగా వచ్చేందుకు చిన్న సినిమాలు పోటీపడవు.. ఇంకా డెబ్యూ హీరో సినిమా అయితే మరి రిస్క్ అనుకుని సైడైపోతారు. అయితే బన్ని వస్తున్న 23న కాకుండా ఆ తర్వాత వస్తున్న శుక్రవారం అనగా జూన్ 30న జయదేవ్ గా వస్తున్నాడు ఏపి మంత్రి గంటా శ్రీనివాస్ రావు తనయుడు రవితేజ.
జయంత్ సి. పరాంజి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో రవితేజ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తమిళంలో హిట్ అయిన సేతుపతి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా బన్నికి పోటీగా ఓ వారం గ్యాప్ తో రిలీజ్ అవుతుంది. మెగా హీరోల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్నికి పోటీగా జయదేవ్ రావడం ఎంతవరకు మంచిదే చూడాలి. అయితే పోటీగా మరో సినిమా లేదు కాబట్టి జయదేవ్ కనుక ఓకే అనిపించుకుంటే మాత్రం కుర్రాడికి లక్ కలిసివచ్చినట్టే.