
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి వార్తలు నందమూరి అభిమానుల్లో ఎప్పటికప్పుడు ఆసక్తిరేపుతున్నాయి. ఈ క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తనయుడి మొదటి సినిమా దర్శకుల వేట ప్రారంభించిన బాలయ్య నిర్మాతగా సాయి కొర్రపాటిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఈమధ్యనే ఓ ఇంగ్లీష్ పేపర్ మోక్షజ్ఞ ఎంట్రీ 2018లో ఫిక్స్ అని డిక్లేర్ చేసింది.
ప్రస్తుతం యాక్టింగ్ కోర్స్ లతో పాటుగా ఫిట్నెస్ ట్రై చేస్తున్న మోక్షజ్ఞ త్వరలోనే తొలి సినిమా ప్రారంభింబోతున్నాడట. తనయుడి ఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారట. స్టార్ డైరక్టర్ ఒకరు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. అయితే సినిమాపై మరి అంచనాలు పెంచకుండా ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.
మోక్షజ్ఞ ఎంట్రీపై సిని పరిశ్రమలో కూడా ఎన్నో అంచనాలున్నాయి. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుండి హరికృష్ణ తనయులు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, నందమూరి కళ్యాణ్ రాం లు స్టార్ హీరోలుగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. మరి ఇదే క్రమంలో మోక్షజ్ఞ ఎలాంటి ప్రేక్షకాదరణ పొందుతాడో చూడాలి.