బన్ని అంతలా భయపడుతున్నాడా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరిష్ శంకర్ కాంబోలో వస్తున్న దువ్వాడ జగన్నాధం సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమా ప్రమోషన్స్ లో బన్ని కాస్త ఇబ్బంది పడుతున్నాడన్నది లేటెస్ట్ న్యూస్. ప్రమోషన్స్ లో కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ ఏమి లేకుండా జాగ్రత్తపడుతున్నారట.

ముందుగానే ఇంటర్వ్యూ చేసే వారితో ఇలాంటివేవి జరుగకుండా మాట్లాడుతున్నారట. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్, గుడిలో మడిలో సాంగ్ విషయాల పట్ల వ్యవహారం పెద్దది చేయకుండా ఎందుకు వచ్చిన రిస్క్ అని ఆ ప్రశ్నలేవి ప్రమోషన్స్ లో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. చూస్తుంటే బన్ని ఈ స్టెప్ రిజల్ట్ మీద పడుతుందని భావించి ఇలా సేఫ్ సైడ్ లో ఉంటున్నాడని అంటున్నారు. 

డిజె ట్రైలర్, టీజర్ ల మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ చూపించిన వివక్షతను గ్రహించి బన్ని డిజె ప్రమోషన్స్ ఇలా ప్లాన్ చేశాడట. ఇప్పటికే ఆడియోలో హరిష్ శంకర్ చేత పవర్ స్టార్ ను పొగిడించడం కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగమే అంటున్నారు.