అల్లు శిరీష్ ఏ నిమిషం ఏమి జరుగునో..!

మెగా హీరోల్లో అల్లు శిరీష్ కూడా లాస్ట్ ఇయర్ శ్రీరస్తు శుభమస్తు హిట్ తో ఫాంలోకి వచ్చాడు. కెరియర్ లో మొదటి హిట్ అందుకున్న అల్లు శిరీష్ ఈసారి ఆ హిట్ మేనియా కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న ఆనంద్ శిరీష్ హీరోగా చేస్తున్న సినిమాకు ఏ నిమిషం ఏమి జరుగునో అని ఫిక్స్ చేశారట.

సురభి, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్ గా రాబోతుందట. కుర్ర హీరోలంతా వరుస ప్రయోగాలతో సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అల్లు హీరో శిరీష్ కూడా డిఫరెంట్ అటెంప్ట్ తో ఈ సినిమా ప్రయోగం చేస్తున్నాడట. ఏ నిమిషానికి ఏమి జరుగునో .. సూపర్ హిట్ సాంగ్ లిరిక్ టైటిల్ గా వస్తున్న ఈ సినిమా శిరీష్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.