
కళాతపశ్వి కె. విశ్వనాధ్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చిన సందర్భంగా ఆయన మీద అభిమానంతో నటి తులసి శంకరాభరణం అవార్డులను ఇస్తున్నారు. విశ్వనాధ్ గారి పేరు మీద అవార్డులను ఇస్తూ ఆమె గురువు మీద ఉన్న అభిమానం చూపిస్తున్నారు. ఈమధ్యనే అనుకున్నా.. జ్యూరీ మెంబర్స్ ను రెడీ చేయడం లాస్ట్ ఇయర్ సినిమాల్లో ఉత్తమ నటులను ఎంపిక చేయడం కూడా జరిగింది.
తెలుగు, తమిళ, హింది, మళయాలంలో శంకరాభరణం అవార్డులు ఇవ్వబడతాయని తెలుస్తుంది. తెలుగులో జనతా గ్యారేజ్ సినిమాకు గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్, శంకరాభరణం అవార్డ్ కైవసం చేసుకొన్నారు.. హిందిలో దంగల్ సినిమాకు ఆమీర్ ఖాన్ ఈ అవార్డ్ అందుకున్నారు. ఇక తమిళంలో పా పాండి సినిమాకు ధనుష్, ఒరు వడక్కన్ సెల్ఫీ సినిమాకు దుల్కర్ సల్మాన్ (మళయాలం) ఈ అవార్డులు అందచేస్తారు. రేపు జరుగనున్న ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సౌత్ సిని పరిశ్రమకు సంబందించిన మహామహులంతా వస్తున్నారని తెలుస్తుంది.