మరోసారి వెంకీ కాంబినేషన్ రిపీట్..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన శ్రీను వైట్ల మాస్ మహరాజ్ రవితేజతో వెంకీ, దుబాయ్ శ్రీను సినిమాలు తీశాడు. హిట్ డైరక్టర్ నుండి శ్రీనువైట్లను స్టార్ డైరక్టర్ గా చేసిన ఆ సినిమాలు తన కెరియర్ కే కాదు రవితేజ కెరియర్ కు మంచి హెల్ప్ అయ్యాయి. ఈ క్రమంలో శ్రీనువైట్ల స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో స్టార్ హీరోలతో హిట్ అందుకున్న శ్రీను వైట్ల ఆ తర్వాత వరుస ఫ్లాపులను అందించాడు.

రీసెంట్ గా వరుణ్ తేజ్ మిస్టర్ కూడా ఫ్లాప్ అవడంతో శ్రీను వైట్ల సినిమా అంటే భయపడుతున్నా హీరోలు. ఈ తరుణంలో తన కెరియర్ కు హిట్ ఇచ్చి బూస్టప్ ఇచ్చిన రవితేజతో మళ్లీ జతకలుస్తున్నాడు శ్రీను వైట్ల. బెంగాల్ టైగర్ తర్వాత టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ సినిమాలు చేస్తున్న రవితేజ శ్రీను వైట్లతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని అంటున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయితే మళ్లీ వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి సినిమాలు ప్రేక్షకులకు అదించే అవకాశం ఉంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో చూడాలి.