టార్గెట్ చిరు రికార్డులేనా బన్ని..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరిష్ శంకర్ కాంబోలో దిల్ రాజు 25వ సినిమాగా నిర్మించిన వస్తున్న దువ్వాడ జగన్నాధం జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు డిజెగా కూడా అదే రికార్డులను తిరిగి రాయాలని చూస్తున్నాడు. బన్ని మొదటి టార్గెట్ మెగాస్టార్ ఖైది నంబర్ 150 వసూళ్లే అని అంటున్నారు.

పదేళ్ల తర్వాత కూడా 100 కోట్లు కొల్లగొట్టిన మెగాస్టార్ మూవీ టార్గెట్ తోనే బన్ని డిజె పరుగులు తీస్తుందట. ప్రపంచవ్యాప్తంగా 1800 థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా 300 సెంటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. సో ఈ లెక్క చూస్తుంటే బన్ని చిరు ఖైది రికార్డులను కచ్చితంగా బీట్ చేస్తాడనిపిస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.