ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్..!

64 ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా ఎన్.టి.ఆర్ లోని నట విశ్వరూపాన్ని చూపించింది. రాజేంద్ర ప్రసాద్ నాన్నగా నటించగా జగపతి బాబు ఈ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. నాన్నకు ద్రోహం చేసిన వారిని ఓడించే కథతో వచ్చిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.

సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ మాత్రమే కాదు డిఫరెంట్ క్యారక్టరైజేషన్ తో కనిపిస్తాడు. స్టార్ హీరోలు కమర్షియల్ హిట్ కొట్టాలనే మాస్ సినిమాలే తీయాలి అన్న ధోరణి మార్చుకుంటూ కంటెంట్ తో ఈమధ్య సినిమాలు వస్తున్నాయి. ఆ క్రమంలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా తారక్ కెరియర్ లో మరో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తెచ్చిపెట్టింది. 2007 లో యమదొంగ సినిమాలు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న తారక్ సరిగ్గా పదేళ్ల తర్వాత 2017లో ఆ అవార్డ్ అందుకోవడం విశేషం.