
ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బ్లాక్ లేడీని పొందడమే కాదు ఆ తర్వాత వారి మాటలతో కూడా మనసులు దోచేస్తున్నారు తారలు. ఈ క్రమంలో బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ అందుకున్న సమంత తన మాటలతో అందరిని ఇంప్రెస్ చేసింది. ఈ అవార్డ్ కోసం తన తాపత్రం చూసిన నాగ చైతన్య ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అన్నాడు. తన పిల్లలు నాన్న పెద్ద స్టార్.. మరి నువ్వేంటి అంటే దానికి సమాధానంగా ఈ అవార్డ్ చూపిస్తా అన్నది సమంత.
తన టాలెంట్ తో అందరిని మనసులను గెలిచిన సమంత తన మాటలతో కూడా అబ్బురపరచింది. అ ఆ సినిమాకు గాను సమంత ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ఈ అవార్డ్ కోసం నామినేషన్లు బాగానే వచ్చాయి. సోగ్గాడే చిన్ని నాయనాలో లావణ్య త్రిపాఠి, నన్నకు ప్రేమతో నుండి రకుల్, జెంటిల్మన్ నుండి నివేదా థామస్, పెళ్లిచూపులు నుండి రీతు వర్మ అవార్డ్ నామినీస్ లో ఉన్నారు. త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్లో వచ్చిన అ ఆలో నితిన్ హీరోగా నటించా సమంత తన నటనతో ఆ సినిమా హిట్ కు ముఖ్య కారణం అయ్యింది.