పవర్ స్టార్ తో ఆది ఫైట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీద ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో వస్తున్న ఈ సినిమాలో ఖుష్బు ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడట. దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా ఆది తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. 

తమిళంలో హీరోగా చేస్తూనే తెలుగులో విలన్స్ రోల్స్ ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే లాస్ట్ ఇయర్ సరైనోడు సినిమాలో వైరం ధనుష్ గా ఓ రేంజ్ లో అలరించిన ఆది ఈసారి పవర్ స్టార్ తో ఫైటింగ్ కు సిద్ధమయ్యాడట. రీసెంట్ గా మరకతమణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది తెలుగులో ఎలాంటి పాత్రకైనా సరే సిద్ధమే అంటున్నాడు. ఇక ప్రస్తుతం నాని నిన్నుకోరి సినిమాలో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఆది. మరి క్రేజీ ప్రాజెక్టులను చేజిక్కించుకుంటున్న ఆది తెలుగులో అనుకున్న ఇమేజ్ సాదిస్తాడో లేదో చూడాలి.