మహేష్ పై మనసు పడ్డ భామ..!

సూపర్ స్టార్ మహేష్ పై మనసు పడ్డది నార్త్ భామ నిక్కి గర్లాని. తెలుగులో రెండు మూడు సినిమాలు చేసినా హిట్ దక్కించుకోలేని ఈ భామ రీసెంట్ గా మరకతమణి సినిమాలో ఆది పక్కన నటించింది. సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడుతున్నాయి. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ ను ఆకాశానికెత్తేస్తుంది నిక్కి గర్లాని. మహేష్ అంటే తనకు చాలా ఇష్టమని తనతో ఛాన్స్ వస్తే ఎగిరిగంతేస్తా అంటుంది.

ఇక మహేష్ తో పాటే ప్రభాస్, పవన్ కళ్యాణ్ లు అన్నా తనకు చాలా ఇష్టమని అంటుంది నిక్కి గర్లాని. అవకాశం వస్తే తెలుగులో ఎలాంటిలో అయినా నటించేందుకు సిద్ధం అంటుంది. చూస్తుంటే ఛాన్స్ వస్తే చాలు కాని తెలుగులో తిష్ట వేసేందుకు కూడా అమ్మడు సిద్ధమే అని తెలుస్తుంది. నిక్కి చెబుతున్న ఈ మాటలన్ని ఆ హీరో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసేందుకే అని తెలుసు. మరి అమ్మడి కోరికని మన్నించి ఆమెకు స్టార్లు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.