.png)
నాచురల్ స్టార్ నాని నుండి మరో ప్రేమకథ రాబోతుంది. ఆ సినిమానే నిన్ను కోరి. నాని, నివేదా థామస్ లు లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ లోనే ఆడవాళ్లు ఎవరికి అర్ధం కావు అంటూ షాక్ ఇచ్చిన నాని ఈసారి ట్రైలర్ లో మరింత మనసుని టచ్ చేసే డైలాగ్స్ తో వచ్చాడు.
'తననే ప్రేమించా.. తననే పెళ్లి చేసుకోవాలనుకున్నా.. చావైనా బ్రతుకైనా తనతోనే అనుకున్నా' అంటూ నాని చెప్పిన ఈ ఒక్క డైలాగ్ చాలు యువత ఈ సినిమా చూసేందుకు పరుగులు తీయడానికి.. యూనివర్సల్ సబ్జెక్ట్ అదేనండి ప్రేమకథలతో పక్కా హిట్ అన్నట్టు కనిపిస్తున్న నిన్ను కోరితో నాని తన ఖాతాలో మరో హిట్ వేసుకుంటాడనడంలో సందేహం లేదు.
శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. జూలై 7న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను ఎంతగానే ఆకట్టుకుంటున్నాయి.