లాభాల్లో డిజె.. అది బన్ని స్టామినా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాధం సినిమా జూన్ 23న రిలీజ్ కు సిద్ధమవుతుంది. హరిష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ఇప్పటికే మెగా అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతున్న డిజె ఇప్పటికే నిర్మాత దిల్ రాజుకి భారీ లాభాలను తెచ్చిపెట్టిందట.

అన్ని ఏరియాలను కలుపుకుని దిల్ రాజు దాదాపు పాతిక కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ అందుకున్నాడట. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని లాస్ట్ ఇయర్ సరైనోడుతోనే 80 కోట్ల వరకు కలక్షన్స్ రాబట్టాడు. ఇక రేంజ్ పెరిగిన డిజె ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు దాటిందని అంచనా. మరి రంజాన్ కానుకగా రాబోతున్న ఈ డిజె మెగా అభిమానులకు ఎలాంటి ఫీస్ట్ ఇస్తాడో చూడాలి. బన్ని బ్రాహ్మిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కచ్చితంగా కొత్త క్యారక్టర్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.