
కింగ్ నాగారున తన కెరియర్ కన్నా ఇప్పుడు తనయులను స్టార్స్ గా నిలబెట్టే పనిలో తలమునకలవుతున్నాడు. ఆ క్రమంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన రారండోయ్ వేడుక సూపర్ హిట్ సాధించినా అనుకున్న రేంజ్ లో కలక్షన్స్ వసూళ్లను సాధించలేకపోయింది. కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చైతు కెరియర్ లో మరో బ్యాక్ టూ బ్యాక్ హిట్ పడేలా నాగ్ ప్లాన్ చేస్తున్నాడట.
అందుకోసమే బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరక్టర్ తో నాగ చైతన్య మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయకా సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను ఆ తర్వాత ఎలాగైనా సరే చైతుతో ఫిక్స్ చేసేలా చూస్తున్నాడట. ఇందుకోసం నాగార్జున బోయపాటికి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడట. అవకాశం నచ్చడంతో బోయపాటి కూడా చైతు కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. లాస్ట్ ఇయర్ సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను బెల్లంకొండ బాబుని స్టార్ గా నిలబెట్టే సినిమా చేస్తున్నాడు. మరి హిట్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన బోయపాటి యువ హీరోలకు ఏ రేంజ్ ఫలితాన్ని ఇస్తాడో చూడాలి.