
వెన్నెల సినిమాతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన కిశోర్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ఇక తన మొదటి సినిమా టైటిల్ తోనే ఫేమస్ అయిన కీశోర్ అప్పటి నుండి వెన్నెల కీశోర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో కమెడియన్స్ కరువవుతున్న ఈ తరుణంలో వెన్నెల కిశోర్ తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న కమెడియన్స్ లో వెన్నెల కిశోర్ ఒకరు.
అమీ తుమీ లాంటి చిన్న బడ్జెట్ సినిమా మంచి కలక్షన్స్ తో దూసుకెళ్తుంది అంటే అది కచ్చితంగా వెన్నెల కిశోర్ ప్రతిభే అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఫుల్ ఫాంలో దూసుకెళ్తున్న వెన్నెల కిశోర్ రోజుకి రెండున్నర లక్షల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం స్టార్ హీరో యువ హీరో అని తేడా లేకుండా అందరి సినిమాల్లో వెన్నెల కిశోర్ ఛాన్సులు పట్టేస్తున్నాడు. బ్రహ్మానందం కొద్దిగా వెనక్కి తగ్గడంతో ఆ ఛాన్స్ అందిపుచ్చుకోవడంలో వెన్నెల కిశోర్ సూపర్ సక్సెస్ అయ్యాడు.