
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ కూడా ఇంప్రెస్ చేసింది. అయితే వదిలిన టీజర్ లో మహేష్ డైలాగ్ ఇంకా సినిమా కథ ఏంటన్నది రివీల్ చేయలేదు. అందుకోసం మరో స్పెషల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారట చిత్రయూనిట్.
ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు కానుకగా స్పైడర్ సెకండ్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారట. ఇందులో మహేష్ కు సంబందించిన రెండు డైలాగ్స్ తో పాటుగా సినిమా రిచ్ నెస్ ఏంటో చూపిస్తారట. వదిలిన 30 సెకన్ల టీజర్ లోనే గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూపించారు. మరి లాంగ్ టీజర్ లో ఇంకెన్ని అద్భుతాలు చూపిస్తారో అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ స్పై ఏజెంట్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్నో అద్భుతాలు ఫ్యాన్స్ గు గిఫ్ట్ గా ఇస్తున్నారట.