బోయపాటి ఇలా షాక్ ఇచ్చాడేంటి..!

టాలీవుడ్ మాస్ అండ్ కమర్షియల్ డైరక్టర్స్ లో ముందువరుసలో ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను. భద్రతో మొదలైన బోయపాటి డైరక్షన్ టాలెంట్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సరైనోడుతో కూడా సత్తా చాటేలా చేసుకున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు కొద్దిరోజులుగా రకరకాల టైటిల్స్ వినబడుతున్న ఈ మూవీ టైటిల్ ఫైనల్ గా జయ జానకి నాయకా అని ఫిక్స్ చేశారు.

బోయపాటి లాంటి మాస్ డైరక్టర్ సినిమాకు ఇలాంటి సాఫ్ట్ టైటిల్ పెట్టడం ఆశ్చర్యకరంగా మారింది. సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించడమే కాదు కమర్షియల్ గా సినిమా స్టార్ హీరోల సినిమాలకు పోటీ ఇస్తుందని చెబుతున్నారు. కెరియర్ లో ఒక్క హిట్ కూడా లేని బెల్లంకొండ శ్రీనివాస్ బోయపాటితో చేస్తున్న ఈ జయ జానకి నాయకా దుమ్ముదులిపేయడం ఖాయమని అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి బోయపాటి చేతిలో పడ్డ బెల్లంకొండ బాబు దశ తిరుగుతుందో లేదో ఈ సినిమాతో తెలుస్తుంది.