
మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక తొలిచిత్రం ఒకమనసు నిరాశ పరచిన సంగతి తెలిసిందే. రామరాజు డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాను మధురా శ్రీధర్ నిర్మించారు. సినిమాలో నాగశౌర్యతో పోటీపడి మరి నటించి మెప్పించింది నిహారిక. సినిమా కమర్షియల్ సక్సెస్ అవలేదు కాని నటిగా నిహారికకు మంచి పేరే వచ్చింది.
సినిమా ఫ్లాప్ అయినందుకు కొద్దిరోజులు ఎవరికి కనిపించని నిహారిక ఈ గ్యాప్ లో తమిళంలో తన ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఇక ప్రస్తుతం తెలుగులో రెండో సినిమా చేసే ఆలోచనలో ఉంది నిహారిక. ఎం.ఆర్ ఎంటర్టైన్మెంట్స్, కవితా కంబైన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఫార్మెట్ లో ఉంటుందని తెలుస్తుంది. ఒక మనసులో ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న నిహారిక ఈసారి మోడ్రెన్ గాళ్ గా ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు. మరి నిహారిక చేస్తున్న ఈ మలి ప్రయత్నంలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.