
సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన సూపర్ స్టార్లు అంత బుల్లితెర మీద కూడా మోజు పెంచుకున్నారు. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై సూపర్ ఇమేజ్ ఉన్నా సరే స్మాల్ స్క్రీన్ పై పలు ప్రోగ్రాంస్ తో అందరిని ఆకట్టుకున్నారు. వారి దారిలోనే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ గా ఎంట్రీ ఇస్తుండగా.. ఇప్పుడు భళ్లాలదేవ రానా కూడా నెంబర్ 1 యారి రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈరోజు టీజర్ రిలీజ్ అవగా తెలుగు తమిళ భాషల్లో ఈ ప్రోగ్రాం ఉంటుందని తెలుస్తుంది. జెమిని టివి ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో త్వరలో టెలికాస్ట్ అవబోతుందట. ఓ పక్క తారక్ బిగ్ బాస్.. మరో పక్క రానా నంబర్ 1 యారి ఇలా సిల్వర్ స్క్రీన్ వదిలి స్మాల్ స్క్రీన్ పై కూడా పోటీ పడుతున్నారు సూపర్ హీరోలు. మరి తారక్, రానాలలో బుల్లితెర ప్రేక్షకులు ఎవరికి సక్సెస్ అందిస్తారో చూడాలి.