బన్ని ఆమెకే ఓటేశాడా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డిజె రిలీజ్ కాకుండానే వక్కంతం వంశీ డైరక్షన్ లో సినిమాకు ముహుర్తం పెట్టేశాడు. లగడపాటి శిరీషా శ్రీధర్ తో పాటుగా నాగబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా టైటిల్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని పెట్టారు. సినిమాలో హీరోయిన్ గా ఎంతోమందిని అనుకుంటున్నా ఫైనల్ గా కన్నడ భామ రశ్మిక మీదే చిత్రయూనిట్ కన్ను పడింది.

బన్ని కూడా ఆమెనే తీసుకోవాలని దర్శక నిర్మాతలకు చెప్పాడట. కన్నడలో కిరిక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన ఈ భామ తెలుగులో ప్రస్తుతం నాగ శౌర్య హీరోగా చేస్తున్న మూవీలో ఛాన్స్ కొట్టేసింది. మరో పక్క ప్రభాస్ సాహోలో కూడా మొదట ఆమె పేరే ప్రస్థావనలో ఉందట. ప్రభాస్ సినిమా పరిస్థితి ఏమో కాని నా పేరు సూర్యలో బన్నికి జోడిగా మాత్రం రశ్మిక ఫైనల్ అని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది సినిమాకు సంబందించిన వారు ఎవరైనా స్పందిస్తే తప్ప విషయం తెలియదు.