జెంటిల్మన్ జంట అదరగొట్టారట..!

నాచురల్ స్టార్ నానితో జెంటిల్మన్ సినిమాలో నటించిన భామ నివేదా థామస్ ఇప్పుడు మరోసారి నానితో నిన్ను కోరి సినిమాలో నటించింది. జూలై 7న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డివి దానయ్య నిర్మించారు. జెంటిల్మన్ సినిమాలో నాని నివేదా కలిసి ఇద్దరికిద్దరు పోటీపడి మరి నటించారు.

నిన్నుకోరి సినిమాలో ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఎంతో క్రేజీగా వచ్చాయట. నటనలో ఇద్దరు మళ్లీ ఎవరికి వారు ది బెస్ట్ అనిపించుకునే ప్రయత్నం చేశారు. సినిమాలో ఆది పినిశెట్టి కూడా నటిస్తున్నాడని తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని నిన్నుకోరితో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ప్రమోషన్ పాటతో మొదలుపెట్టిన ఈ టీం సినిమా మాత్రం హిట్ పక్కా అని అంటున్నారు.