శమంతకమణి ఇంప్రెసివ్ టీజర్..!

యువరక్తాన్ని సరిగా వాడాలే కాని అద్భుతమైన సినిమాలు వస్తాయి.. దాన్నే ప్రూవ్ చేస్తూ ఏకంగా నలుగురు లీడింగ్ యువ హీరోలు కలిసి చేస్తున్న సినిమా శమంతకమణి. ఇందులో ఎవరిది మెయిన్ క్యారక్టర్ అనేది తెలియడానికి టీజర్ రూపంలో ఓ ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు శ్రీరాం ఆదిత్య. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. నారా రోహిత్ డైలాగ్ తో వదిలిన ఈ టీజర్ సిని విమర్శకులను సైతం వారెవా అనేలా చేసింది.

సినిమాలో సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది, నారా రోహిత్ నలుగు హీరోలు కలిసి నటిస్తున్నాడు. శమంతకమణి అంటే ఓ కారు అన్నది అర్ధమవుతుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ పాత్రలో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కనిపించబోతున్నాడు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భలే మంచి రోజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీరాం ఆదిత్య శమంతకమణితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.