ఆ హీరో మరో ప్రయత్నం విఠలాచార్య..!

సీనియర్ హీరో, నటుడు నరేష్ ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడని తెలిసిందే. ఒకప్పటి హీరోలకు ఇప్పుడు మంచి గిరాకి ఏర్పడింది. ఆ క్రమంలో నరేష్ కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రల్లో చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఎలాగు సినిమా ఫ్యామిలీ కాబట్టి తన కొడుకుని హీరోగా నిలబెట్టాలని ఫిక్స్ అయ్యాడు నరేష్. తనయుడు నవీన్ విజయ కృష్ణను నదిని నర్సింగ్ హోం సినిమాతో ఎంట్రీ ఇప్పించాడు.         

ఆ సినిమా ప్రేక్షకులు ఇంప్రెస్ చేయగా ఇప్పుడు మళ్లీ రెండో ప్రయత్నంగా విఠలాచార్యతో వస్తున్నాడు నవీన్ విజయ్ కృష్ణ. విఠలచార్య అనే పేరు వినగానే తెలుగులో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే అద్భుత జానపద సినిమాలను తీసిన దర్శకుడు గుర్తుకొస్తాడు. ఇప్పుడు టెక్నాలజీతో తీసే గ్రాఫికల్ మాయాజాలమంతా విఠలాచార్య ఆనాడే చూపించి అబ్బురపరచాడు. ఇక ఆయన పేరుతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందో చూడాలి. సుహాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ముహుర్తం నాడే టైటిల్ ఎనౌన్స్ చేశారు. అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గురించి మిగతా డీటేల్స్ త్వరలో వెళ్లడవుతాయి.