
సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ తనయ శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. జీవిత రాజశేఖర్ ఇద్దరు సిని పరిశ్రమకు చెందిన వారే తమ కూతురిని కూడా హీరోయిన్ గా చూడాలనేది వారి కోరిక. అయితే శివాని మాత్రం మొదట కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందట. ఇప్పటికే తమిళంలో రెండు సినిమాలకు సైన్ చేసింది అమ్మడు.
ఇక తెలుగులో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉంటుంది. ఈ క్రమంలో తమిళంలో టాలెంట్ చూపించేస్తే ఇక్కడ లక్కీ ఛాన్సులు కొట్టే అవకాశం ఉంది. ఎలాగు యాక్టింగ్ బ్లడ్ కాబట్టి శివాని కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ కూడా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో పిఎస్వి గరుడవేగ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నారు రాజశేఖర్.