తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి రికార్డ్..!

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అంచనాలను మించి అద్భుత విజయం అందుకుంది బాహుబలి కన్ క్లూజన్ సినిమా. ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 1500 కోట్ల కలక్షన్స్ వసూళు చేసిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి ప్రభంజనం సృష్టించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి సంచలనాలు అన్ని ఇన్ని కావు.    

తెలుగు రెండు రాష్ట్రాల్లో 100 కోట్లే ఎక్కువ అనుకుంటున్న సమయంలో ఏకంగా కేవలం రెండు రాష్ట్రాల్లోనే 200 కోట్లను కొల్లగొట్టింది బాహుబలి-2. కోస్తా 94 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటివరకు 196 కోట్లను రాబట్టిందట. ఇక మిగిలిన 4 కోట్లను రాబడితే 200 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి రికార్డ్ చరిత్రలో మిగిలిపోతుంది. ప్రభాస్, రానాల నటన, రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమా ఇంతటి ప్రభంజనం సృష్టించింది.