
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్మాల్ స్క్రీన్ పై మెరవబోతున్న రియాలిటీ షో బిగ్ బాస్. స్టార్ మా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ షోలో తారక్ హోస్ట్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ షో ఫస్ట్ లుక్ తోనే ఎన్.టి.ఆర్ లుక్ అదరగొట్టగా ఫ్యాన్స్ అంతా ఈ రియాలిటీ షోతో ఫుల్ ఖుషిగా ఉన్నారు. అయితే ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం ఎన్.టి.ఆర్ అప్పుడే బుల్లితెర షో చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు.
తారక్ ఎందుకు అంత తొందరపడ్డాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. హిందిలో సల్మాన్, కన్నడలో సుదీప్ లాంటి వారు చేస్తున్న ఈ షో తమిళంలో కమల్ హాసన్ చేస్తున్నాడు. తెలుగులో జూనియర్ కు ఫాలోయింగ్ తెలుసుకుని భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి బిగ్ బాస్ కు బుక్ చేసుకున్నారు. క్రేజ్ పరంగా చూస్తే తారక్ కు బిగ్ బాస్ పెద్ద అసెట్ అయ్యేట్టు కనిపించినా ఓ వర్గం మాత్రం అప్పుడే స్మాల్ స్క్రీన్ పై తారక్ రావడం మింగుడు పడట్లేదు.