
టాలీవుడ్ లో యువ హీరోల హవా ఫుల్ రేజ్ లో ఉంది.. వరుస హిట్లు సాధిస్తున్న హీరోలు అందరు కలిసి మల్టీస్టారర్స్ కు ఊపు తెస్తున్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది కలిసి నటిస్తున్న సినిమా శమంతకమణి. భలే మంచి రోజు శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంలో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో ఆ నలుగురు హీరోలతో పాటు మరో స్టార్ హీరో నటిస్తున్నాడు. అతనెవరో కాదు సూపర్ స్టార్ మహేష్. సినిమాలో మహేష్ కెమియో ఉందా అంటే అలాంటిదేమో లేదు కాని మహేష్ పేరునే సినిమా కోసం వాడుతున్నారు. శమంతకమణిలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ఆయన సూపర్ స్టార్ మహేష్ గా సినిమాలో కనిపిస్తారట. మరి ఆ క్య్రాక్టర్ ఎలా డిజైన్ చేశారు ఏంటన్నది తెలియదు కాని మొత్తానికి డిఫరెంట్ ప్రయత్నంగా ఇప్పటికే ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న శమంతకమణి సినిమాలో మహేష్ ఉన్నాడని తెలియగానే సినిమా మీద మరింత ఫోకస్ పెట్టేశారు ఆడియెన్స్.