
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో వరుస హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న రకుల్ స్పైడర్ తో లక్కీ ఛాన్స్ పట్టేసిందని అనుకున్నారు. కాని స్పైడర్ విషయంలో మాత్రం రకుల్ అంత సంతోషంగా లేదని తెలుస్తుంది.
సినిమా అనుకున్న దానికన్నా లేట్ అవడం ఒక కారణమైతే సినిమాలో తన రోల్ కేవలం పాత్రలకే పరిమితమవడం కూడా రకుల్ స్పైడర్ విషయంలో అప్సెట్ అయ్యేలా చేసిందట. సాధారణంగా మురుగదాస్ సినిమాలో హీరోయిన్స్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది కాని స్పైడర్ లో మాత్రం రకుల్ కేవలం పాటలకే అంటూ ప్రచారం జరుగుతుంది. మహేష్ పక్కన ఛాన్స్ వచ్చినందుకు ఎగిరిగంతేసిన రకుల్ స్పైడర్ పై వస్తున్న కామెంట్స్ తో తలపట్టుకునే పరిస్థితి వచ్చిందట.