
లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న నితిన్ లాస్ట్ ఇయర్ అఆ హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం హను రాఘవపుడి డైరక్షన్ లో 'లై' సినిమా చేస్తున్న నితిన్ ఆ సినిమాను ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక అదే రోజున మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ జవాన్ కూడా రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. రచయిత బివిఎస్ రవి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కూడా ఆగష్టు 11న రిలీజ్ అవుతుందట.
'లై' గా నితిన్, జవాన్ గా తేజ్ ఈ రెండు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర ఫైట్ కు సిద్ధమయ్యాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇద్దరు పవర్ స్టార్ ఫ్యాన్సే.. మరి కెరియర్ లో మొదటిసారి నితిన్, తేజ్ పోటీపడుతున్న ఈ తరుణంలో ఈసారి గెలుపు ఎవరి చెంత చేరుతుందో. లాంగ్ వీకెండ్ అవడం చేత ఆగష్టు 11న రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాలు కాస్త బెటర్ అనిపిస్తే చాలు రెండు మంచి ఫలితాలతో గట్టెక్కినట్టే. ఫైనల్ గా నితిన్, సాయి ధరం తేజ్ ఇద్దరిలో పైచేయి ఎవరిది అవుతుందో చూడాలి.