
క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి రకరకాల కామెట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక తాజాగా రంగస్థలంపై వస్తున్న రూమర్ ఏంటంటే ఈ టైటిల్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అసంతృప్తిని వ్యక్తపరిచాడట. టైటిల్ చాలా ఓల్డ్ గా ఉంటుందని సుకుమార్ తో అన్నాడట. అయితే సుక్కు మాత్రం తాను అనుకున్న కథకు రంగస్థలం అయితేనే పర్ఫెక్ట్ అని చెప్పాడట. చెర్రి కూడా సుకుమార్ మాటకే సపోర్ట్ చేయడంతో మెగాస్టార్ కు నచ్చకుండానే రంగస్థలం టైటిల్ ఎనౌన్స్ చేశారట.
అసలైతే చిరంజీవి ఈ సినిమాకు పల్లెటూరి మొనగాడు అని పెట్టాలని సూచించాడట. సుకుమార్ తన సినిమాల విషయంలో ఫైనల్ డైశిషన్ తనదే కాబట్టి రంగస్థలంతో అందరికి షాక్ ఇచ్చాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ రంగస్థలం 2018 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందో లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం.