
మంచు హీరోగా రాకింగ్ స్టార్ ఇమేజ్ సంపాదించిన మనోజ్ స్టార్ క్రేజ్ దక్కించుకోలేకపోయాడు. కెరియర్ లో కాస్త వెనుకపడ్డ మంచు కుర్రాడు ఇప్పుడు ఏకంగా సినిమాలకే గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నాడట. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేశాడు మంచు మనోజ్. ప్రస్తుతం చేస్తున్న ఒక్కడు మిగిలాడు.. ఆ తర్వాత ఒక సినిమా ఇక ఇవే తన చివరి సినిమాలంటూ ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు మంచు మనోజ్.
హీరోగా సినిమాలను మానేసి దర్శకుడిగా కంటిన్యూ అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తన సినిమాలకు డ్యాన్స్, ఫైట్స్ కంపోజ్ చేసుకునే మనోజ్ ఇక డైరక్షన్ కూడా చేస్తాడని అంటున్నారు. సినిమాలు ఆపేస్తున్నా అని చెప్పాడు కాని ఆ తర్వాత ఏం చేస్తాడు అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మంచు కుర్రాడు. హీరోగా కెరియర్ ఫుల్ స్టాప్ పెట్టి పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలనే ఆలోచనలో మనోజ్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.